Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
కారేపల్లి, అక్టోబర్ 10: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ సంబురాల్లో మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా పాల్గొన్నారు.
కారేపల్లి, అక్టోబర్ 10: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ సంబురాల్లో మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిలో లభించే రంగురంగుల, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మను మహిళలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
ఎంగిలిపూల బతుకమ్మను పునస్కరించుకొని తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో మహిళలు బతుకమ్మలను ఆకర్షణీయంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి పురాణ, ఇతిహాసాల పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగలో ఎంగిలిపూల బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
అడవి పూలను పూజిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఈ పండుగ తెలంగాణ మహిళల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు మహిళలు ఒకచోట చేరి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను పేర్చి ఆనందంగా ఆడిపాడడంతో మండలంలోని పలు గ్రామాల్లో సందడి కనిపించింది. తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

