TVS Family | టీవీఎస్ గ్రూప్‌లో ముదిరిన ఆస్తుల వివాదం.. ఆస్తిలో ఈక్వల్ షేర్ కోరుతూ తండ్రికి లక్ష్మీ వేణు నోటీస్..!
TVS Family | టీవీఎస్ గ్రూప్ (TVS Group) లో ఆస్తుల విభజనకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తీసుకుంది. టీవీఎస్ సంస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న వేణు శ్రీనివాసన్ (Venu Srinivasan) కుమార్తె లక్ష్మి వేణు (Laxmi Venu) .. తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తులను చట్టబద్ధంగా విభజించాలని కోరుతూ తండ్రికి నోటీస్ పంపించారు.
TVS Family : టీవీఎస్ గ్రూప్ (TVS Group) లో ఆస్తుల విభజనకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తీసుకుంది. టీవీఎస్ సంస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న వేణు శ్రీనివాసన్ (Venu Srinivasan) కుమార్తె లక్ష్మి వేణు (Laxmi Venu) .. తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తులను చట్టబద్ధంగా విభజించాలని కోరుతూ తండ్రికి నోటీస్ పంపించారు. కుటుంబపెద్దగా ఆయన తన బాధ్యతలను నెరవేర్చి ఆస్తులను న్యాయబద్ధంగా చట్టప్రకారం విభజించేలా చూడాలని తన నోటీసులలో లక్ష్మి కోరారు.
2005లో సవరించిన ‘హిందూ వారసత్వ చట్టం 1956 (Hindu Succession Act 1956)’ ప్రకారం.. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తనకు సమాన వాటా పొందే హక్కు ఉందని లక్ష్మి తన నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 6ను ఉటంకిస్తూ.. పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకూ కుమారులతో సమానమైన హక్కులు ఉంటాయని, వారు స్వతంత్రంగా ఆస్తి విభజనను కోరవచ్చని ఆమె స్పష్టంచేశారు. VS ట్రస్ట్ ఇతర హోల్డింగ్ సంస్థల ద్వారా కలిగి ఉన్న కుటుంబ వాటాలు ప్రశ్నార్థకమైన ఆస్తులలో ఉన్నాయి.
2020 నాటి TVS కుటుంబ ఒప్పందం ప్రకారం వేణు శ్రీనివాసన్ వర్గానికి కేటాయించిన వ్యాపారాలు, ఆస్తులు వాటిలో ఉన్నాయి. వాటిలో TVS హోల్డింగ్స్, TVS మోటార్ కంపెనీ, TVS క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ (Sundaram-Clayton) సంస్థలలోని వాటాలు కూడా ఉన్నాయి. అయితే 2020లో ఆస్తుల విభజనకు టీవీఎస్ ఉమ్మడి కుటుంబంతో చేసుకున్న ఒప్పందం.. ఇప్పుడు తన కుటుంబంలో ఆస్తుల విభజనకు వర్తించదని లక్ష్మి వాదిస్తున్నారు. ఇదే ఇప్పటి వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
లక్ష్మి వాదన ప్రకారం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో ఆస్తుల పరిష్కారం లేదా విభజన ఎప్పుడూ ప్రారంభం కాలేదు, ఎప్పుడూ పూర్తి కాలేదు. కుటుంబ వ్యాపారాలను నిర్వహించడంవల్ల ఒక వ్యక్తికి సొంతంగా ప్రత్యేక యాజమాన్య హక్కులు లభించవని, అదే సమయంలో ఇతర కుటుంబసభ్యుల చట్టపరమైన హక్కులు తొలగిపోవని లక్ష్మి వాదిస్తున్నారు. కుటుంబ ఆస్తులలో ప్రధాన వాటాను తన హక్కులను ఫణంగా పెట్టి తన సోదరుడు సుదర్శన్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ చర్యలను ఆమె చట్టపరమైన, నమ్మకద్రోహ సమస్యగా అభివర్ణించారు. ఏకపక్ష నిర్ణయాలు, కార్పొరేట్ ఒప్పందాల ద్వారా కుమార్తెల హక్కులను కాలరాయలేరని లక్ష్మి తన వాదన వినిపిస్తున్నారు. లీగల్ నోటీస్ పంపినప్పటికీ లక్ష్మి సామరస్యపూర్వక పరిష్కారానికే మొగ్గు చూపుతున్నారు. ప్రతి కుటుంబ సభ్యుని హక్కులను గౌరవించే న్యాయమైన ప్రక్రియ ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ పరిణామంపై లక్ష్మి తల్లి మల్లికా శ్రీనివాసన్ బహిరంగంగానే తన మద్దతును ప్రకటించారు. కుటుంబ ఆస్తులలో తన కుమార్తెకు సరైన వాటా దక్కాలని అన్నారు.
సౌహార్దపూర్వక పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఎలాంటి అర్థవంతమైన పురోగతిని సాధించలేదని మల్లిక వ్యాఖ్యానించారు. కుటుంబ విషయాల్లో కుమారుడికి, కుమార్తెకు సమాన హక్కులు ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ఒక తల్లిగా తనకు కుమారుడు, కుమార్తె ఇద్దరూ అన్ని విధాలా సమానమేనని పేర్కొన్నారు. కుటుంబ ఆస్తులలో లక్ష్మికి కూడా చట్టబద్ధమైన వాటా ఉందని, అది సుదర్శన్‌కు దక్కే వాటాతో సమానంగా ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నానని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TVS Family | టీవీఎస్ గ్రూప్‌లో ముదిరిన ఆస్తుల వివాదం.. ఆస్తిలో ఈక్వల్ షేర్ కోరుతూ తండ్రికి లక్ష్మీ వేణు నోటీస్..!
Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
MLA malreddy rangareddy | నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేనూ చేస్తా.. మల్ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్
SUV Snatched: గన్‌పాయింట్‌లో బెదిరించి.. ఎస్‌యూవీతో పరారీ.. సరిహద్దులో అలర్ట్
Donga Naa Koduku | లాభాల్లోకి మౌళి ‘డీఎన్‌కే’.. మూడు రోజుల్లోనే రూ.10.15 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

