SexualHarassment | కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే ఓ నటి సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్న ఒక ఆకతాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని అన్నాపూర్ణేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేధింపులు నవీన్ అనే వ్యక్తి నటికి ఫేస్బుక్ వేదికగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో ప్రారంభమయ్యాయని.. ఫేస్బుక్లో అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు పంపడం ద్వారా ఆ వ్యక్తి నటిని వేధించినట్లు వెల్లడించారు. అయితే నటి ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించినప్పటికీ అతడు అసభ్యకరమైన కంటెంట్‌ను పంపడం మొదలుపెట్టినట్లు తర్వాత బ్లాక్ చేసిన అనంతరం కూడా నకిలీ ఖాతాలతో వేధింపులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.