ఆరుతడి పంటలు వేయాలి
యాసంగిలో కరువును దృష్టిలో పెట్టుకొని పంటల సాగు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఎక్కువ శాతం ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని కోరారు.
ఆరుతడి పంటలు వేయాలి
రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో కరువును దృష్టిలో పెట్టుకొని పంటల సాగు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఎక్కువ శాతం ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని కోరారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రానున్న యాసంగిలో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో పంటలకు నష్టం వాటిల్లకుండా పంట కోతలను తాతాలికంగా వాయిదా వేసుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
30న వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సమావేశం
ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇండియన్ వెజిటేబుల్ అయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐవీపీఏ) గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు భవిష్యత్తు, రైతుల అభ్యున్నతి, పంట ఉత్పాదకత పెంపు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రసంగించాలని కోరారు. దీనిపై మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును చేపడుతున్న అన్ని కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నదని చెప్పారు. గోద్రెజ్, పతంజలి, హిందుస్థాన్ యూనీలివర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని, ఆయా కంపెనీల కార్యకలాపాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

