జేఎన్టీయూ సెక్యూరిటీ టెండర్లపై వివాదం
జేఎన్టీయూహెచ్ సెక్యూరిటీ టెండర్లు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు రద్దుచేసిన యూనివర్సిటీ.. తాజాగా నామినేషన్ పద్ధతిపై ఓ ఏజెన్సీకి టెండర్లు ఖరారుచేసింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూహెచ్ సెక్యూరిటీ టెండర్లు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు రద్దుచేసిన యూనివర్సిటీ.. తాజాగా నామినేషన్ పద్ధతిపై ఓ ఏజెన్సీకి టెండర్లు ఖరారుచేసింది. ప్రస్తుత టెండర్తో పోల్చితే కోటి రూపాయలు అదనపు భారం పడుతుందన్న ఆరోపణలొస్తున్నాయి. పైగా బహిరంగ టెండర్లు పిలవడం.. రద్దుచేయడం.. మళ్లీ నామినేషన్ పద్ధతిపై కేటాయించడం వివాదాస్పదంగా మారింది.
దీని వెనుక భారీ మొత్తం చేతులు మారినట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నామినేషన్ పద్ధతిపై ఎంపికచేసిన సంస్థ అర్హతలు, భద్రతా లైసెన్స్లు, అనుభవం, ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు వంటి వివరాలు బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరుపాలని కోరుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

