పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బంధంపల్లి స్వరూప గార్డెన్స్‌లో సభను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు టీ భానుప్రసాదరావు, ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ తదితరులు పాల్గొన్నారు.
– పెద్దపల్లి, నమస్తే తెలంగాణ