మైథాలజీ టచ్‌తో రూపొందిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఏకకాలంలో మూడు బాణాలు సంధించడంలో నేర్పరి అయిన బార్బరికుడి స్ఫూర్తితో సినిమాకు ఆ టైటిల్ పెట్టారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను ప్రధాన పాత్రధారులు. మోహన్‌శ్రీవత్స దర్శకుడు.
విజయ్‌పాల్ రెడ్డి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఓ పురాణపాత్ర నేటి యుగంలోకి ప్రవేశిస్తే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశమని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుందని, సత్యరాజ్ నటన హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది.