హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 26 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న డీఎస్పీలతో పాటు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీఎస్పీలకు కూడా స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు.