హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): సమగ్ర పశుగణనకు వినియోగించనున్న ‘ఈలిస్’ యాప్‌పై రాష్ర్టాల నోడల్ అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ దక్షిణాది రాష్ర్టాల సదస్సును రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐపార్డ్లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక సలహాదారు జగత్ హజారికా, రాష్ట్ర పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ బీ గోపి, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ర్టాలకు చెందిన నోడల్ అధికారులు పాల్గొన్నారు.