ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రాక్టర్ బోల్తా | విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది.

నల్లగొండ : విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
డిండి మండలం నెమలిపురి పంచాయతీ పరిధిలోని రేగళ్లగడ్డ తండాకు చెందిన ఇద్దరు యువకులు కామేపల్లి సబ్‌స్టేషన్ నుంచి ట్రాక్టర్లో బొలన్పల్లికి విద్యుత్ స్తంభాలను తీసుకువస్తున్నారు.
టి.గౌరారం వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీతో సహా బోల్తాపడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
స్తంభాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి తునాతునకలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

