రాంచీ: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుడు, అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్‌దాను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రశాంత్ బోస్పై నిఘా ఉంచిన పోలీసులు ఆయనతోపాటు భార్య శీలా మరాండీని కూడా అదుపులోకి తీసుకున్నారు. శీలా మరాండీ ప్రస్తుతం సీపీఐ (మావోయిస్టు) సభ్యురాలిగా ఉన్నారు. బెంగాల్‌కు చెందిన బోస్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.