వాషింగ్టన్: టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావరిక్ చిత్రం బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కనక వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ సినిమా వంద కోట్ల డాలర్లు వసూల్ చేసింది. కేవలం 31 రోజుల్లో ఆ రికార్డును టాప్ గన్ అందుకోవడం గమనార్హం. గడిచిన 40 ఏళ్ల కెరీర్లో టామ్ క్రూజ్ చిత్రం ఈ మైలురాయిని చేరుకోవడం కూడా తొలిసారే. జోసెఫ్ కొసిన్స్కీ దర్శకత్వంలో వచ్చిన టామ్ క్రూజ్ చిత్రం ఇంకా అన్ని ఆదేశాల్లో ఆడుతోంది. అమెరికా మార్కెట్లో ఈ చిత్రం ఇప్పటికే 521.7 మిలియన్ల డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లో 484.7 మిలియన్ల డాలర్ల వసూల్ చేసింది.