సేలం, మార్చి 28: కలల బైక్ను కొనుక్కునేందుకు మూడేండ్లు కష్టపడ్డాడు. పైసా, పైసా కూడబెట్టి ఎట్టకేలకు డబ్బు పోగుచేశాడు. అయితే, ఇష్టపడిన బైక్ను సొంతం చేసుకొనే సమయం కలకాలం గుర్తుండిపోవాలి అనుకొన్నాడో ఏమో.. బైక్ ధర రూ. 2.6 లక్షలను రూపాయి నాణేల్లో చెల్లించాడు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన భూపతి ఇలా షోరూం యజమానికి షాక్ ఇచ్చాడు. అయితే, యువకుడిని నిరుత్సాహపర్చకూడదనుకొన్న యజమాని.. ఆ డబ్బును అలాగే స్వీకరించాడు. నాణేలను లెక్కపెట్టేందుకు సిబ్బందికి 10 గంటల సమయం పట్టింది.