ప్రారంభమైన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్
తిరుపతి లోక్‌సభ |

అమరావతి : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు పోలింగ్ కొనసాగనున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలుపొందిన బల్లి దుర్గా ప్రసాద్ గతేడాది సెప్టెంబర్‌లో కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 17 లక్షల 11 వేల 195 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట సెగ్మెంట్లలో జరిగే పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీరు సహా ఇతర సదుపాయాలు కల్పించారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా వేయనున్నట్లు తెలిపారు. ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా… ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 13 వేల 827 మంది రాష్ట్ర పోలీసులు, 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 877 పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల్ని మోహరించారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 466 పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
వానాకాలం దండిగా వర్షాలు
గాలిలో కరోనా
పిల్లలపై పంజా
ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
రాష్ట్రంలో రెండు రోజుల పొడి వాతావరణం
ఐదు రాష్ట్రాల్లో రూ.వెయ్యి కోట్ల విలువైన మద్యం, నగదు పట్టివేత : ఈసీ
బెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ షురూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

