Tiger Nageshwara Rao Movie | దసరాపై ముందుగా ఖర్చీఫ్ వేసుకున్న సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని రవన్న ఫ్యాన్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌పై దర్శకుడు వంశీ చిన్న అప్డేట్ ఇచ్చాడు. హలో తమ్ముళ్లు, మీ మెసేజ్‌లు చూసి మళ్లీ మీకు ఆకలేస్తుందని అర్థమైంది. ఈ సారి మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది. త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తాము. కొంచెం ఓపిక పట్టండంటూ టీజర్ అప్డేట్ అడుగుతన్న ఫ్యాన్స్‌కు రిప్లై ఇచ్చాడు. దాంతో త్వరలోనే టీజర్ కూడా రాబోతుందని స్పష్టమైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
హలో తమ్ముళ్లు, మీ మెసేజ్ లు చూసి మళ్లీ మీకు ఆకలేస్తుందని అర్థమైంది.
ఈ సారి మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది. త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తాము .
కొంచెం ఓపిక పట్టండి ❤️🤗🔥@TNRTheFilm @AAArtsOfficial @AbhishekOfficl @AnupamPKher @NupurSanon @gvprakash @madhie1…— VAMSEE (@DirVamsee) July 25, 2023