నూతన తారలతో శివకల్యాణ్ దర్శకత్వంలో కె.కళ్యాణ్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘తురుమ్ఖాన్లు’. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్లో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా చిత్రం అందర్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు. శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చరణ్ అంబటి, సంగీతం: గగన్ కేఎస్.