Dharmapuri | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
Dharmapuri | జగిత్యాల జిల్లా(Jagtial )ధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.
ధర్మపురి : జగిత్యాల జిల్లా(Jagtial )ధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాల నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ అతివేగంగా దూసుకు వచ్చి ఆటోను ఓవర్ టెక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ ను అతివేగంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బుల్లెట్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు హనుమాన్ దీక్షదారులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మృతులను ధర్మపురి పట్టణ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

