కేసీఆర్ తాత మంచిగున్నారా..!
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికీ గౌరవమే! ఆయనంటే పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ ఆసక్తే! రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరలో ఓ చిన్నారి.. కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నది.
- కేటీఆర్‌ను అడిగిన చిన్నారి శ్రీయాన్సిక
- బాగున్నారని బదులిచ్చిన కేటీఆర్
- వీర్నపల్లి మండలం అడవి పదిరలో ఘటన
వీర్నపల్లి, నవంబర్ 16 : తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికీ గౌరవమే! ఆయనంటే పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ ఆసక్తే! రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరలో ఓ చిన్నారి.. కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నది. మాజీ సర్పంచ్ తిప్పవరపు భాసర్ కుమార్తె దీపిక- భానుప్రసాద్చారి దంపతులను ఆశీర్వదించేందుకు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామానికి రాగా, అదే గ్రామానికి చెందిన నీలం జలేందర్-లాస్య దంపతుల మూడేండ్ల కూతురు కేటీఆర్‌ను చూసి సంబురపడింది.
‘కేటీఆర్ అంకుల్.. కేసీఆర్ తాత మంచిగున్నాడా?’ అంటూ అడిగింది. చిన్నారి మాటలకు చిరునవ్వు చిందించిన కేటీఆర్.. దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలుకరించారు. ‘కేసీఆర్ తాత బాగున్నాడు’ అంటూ సమాధానమిచ్చారు. అనంతరం చిన్నారి ఏ తరగతి చదువుతున్నదో అడిగి తెలుసుకున్నారు. చిన్నారి అమాయక ప్రశ్న.. కేటీఆర్ ఆప్యాయ పలుకరింపు అకడున్న వారిని ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

