నిద్రలోనే కడతేర్చారు

- డిచ్‌పల్లిలో ముగ్గురి దారుణ హత్య..
- మృతుల్లో ఇద్దరు పంజాబ్ వాసులు
డిచ్పల్లి, డిసెంబర్ 8: ఒకేచోట ముగ్గురు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నడిపల్లిలో ఎన్‌హెచ్ 44 పక్కన గురునానక్ హార్వెస్టర్ వర్క్‌షాపు ఉన్నది. ఇందులో పంజాబ్‌లోని సాహోకే గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ (33) ఎనిమిది నెలలుగా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం పంజాబ్‌కే చెందిన జోగీందర్ సింగ్ (45)ను మెకానిక్‌గా పనిచేసేందుకు పిలిపించారు. మంగళవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డులోకి చొరబడి మారణాయుధాలతో ఇద్దరి తలలపై మోది హత్యచేశారు. వర్క్‌షాపులోనే నిద్రించే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని భోజ్యానాయక్ తండా కు చెందిన బానోత్ సునీల్ (25) అనే క్రేన్ డ్రైవర్‌ను సైతం దుండగులు హతమార్చారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ డీసీపీ(క్రైమ్) స్వామి ఘటనాస్థలిని పరిశీలించారు. డాగ్‌స్కాడ్ మృతదేహాల వద్ద నుంచి ఆర్మూర్ రోడ్డువైపు వెళ్లి ఆగిపోయింది. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. వర్క్‌షాపులోని మూడు సీసీ కెమెరాలు కొద్దిరోజుల క్రితమే మరమ్మతులకు గురైనట్టు వర్క్‌షాపు యజమాని సంజీవ్‌రెడ్డి పోలీసులకు చెప్పారు. మరో 15 రోజుల్లో పనులు ముగించుకొని పంజాబ్ వెళ్లాల్సిన సమయంలో హర్పాల్సింగ్, జోగీందర్‌సింగ్ హతమవ్వడం విషాదం నింపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

