France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
France Protests | ఫ్రాన్స్ (France) లో పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా నిరసనలు (Protests) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు 143 ఏళ్ల నాటి చారిత్రక లిమోజెస్ టౌన్‌హాల్ (Limoges Town Hall) భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో భవనం చాలావరకు ధ్వంసమైంది.
France Protests : ఫ్రాన్స్ (France) లో పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా నిరసనలు (Protests) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు 143 ఏళ్ల నాటి చారిత్రక లిమోజెస్ టౌన్‌హాల్ (Limoges Town Hall) భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో భవనం చాలావరకు ధ్వంసమైంది. ఈ భవనాన్ని 1873 నుంచి నిర్మించారు. నిర్మాణం పూర్తవడంతో 1883లో అధికారికంగా ప్రారంభించారు.
లిమోజెస్ టౌన్‌హాల్ భవనం ఫ్రాన్స్‌లో చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. ఇవాళ ముసుగులు ధరించిన కొందరు ఆందోళనకారులు ఆ భవనానికి నిప్పుపెట్టి ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మంటల కారణంగా భవనం పైకప్పు పూర్తిగా కూలిపోయిందని, బయటి భాగంలో మూడింట రెండొంతులు ధ్వంసమైందని వెల్లడించారు. ఇది దేశ వారసత్వ సంపదకు జరిగిన ఘోర విపత్తు అని స్థానిక ప్రిఫెక్ట్ మారిస్ బరేట్ ఆవేదన వ్యక్తంచేశారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని బరేట్ పేర్కొన్నారు.
కాగా దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలల్లో పరిస్థితులకు వ్యతిరేకంగా లక్షలాది మంది మొదట శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టారు. అయితే పారిస్‌తోపాటు మార్సెల్, లియోన్, లిల్లే వంటి నగరాల్లో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు లూటీలకు, దహనకాండలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో దేశవ్యాప్తంగా సుమారు 1200 మందిని అదుపులోకి తీసుకున్నామని, 150 మందికిపైగా పోలీసులు గాయపడ్డారని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. ఈ హింసను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

