రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో రేవంత్రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు నేతలంతా అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. సిరిసిల్లలో ఎటు చూసినా కేటీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పనులే కనిపిస్తుండటం, ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన ఉండడంతో సభ సక్సెస్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మహిళ సంఘాలకు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టినట్టు సమాచారం. మహిళా సంఘాల నుంచి వచ్చేవారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తున్నది. సభకు రాని వారికి రూ.500 నుంచి రూ.1500 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సభకు పెద్ద సంఖ్యలో జనాలను తీసుకురావాలంటూ సిరిసిల్లలో యజమానులకు, అనుబంధ సంఘాలకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.