రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 28 ( నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో భూ అక్రమాలు జరిగాయంటూ అసెంబ్లీలో చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆరోపణలు నిరూపించలేకపోతే సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక స్థానం ఉన్నదని, నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగిందో వారికి తెలుసని స్పష్టం చేశారు. సిరిసిల్లకు మూడేండ్లలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సిరిసిల్లకు వచ్చిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసేలా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వరర్ టూ ఓనర్ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేయాలని, చేనేత, మరమగ్గ కార్మికుల సమస్యలను పరిషరించి వారికి అండగా నిలువాలని కోరారు. సిరిసిల్లకు ఇచ్చిన హామీల్లో ఈ మూడేండ్లలో ఏం అమలు చేశారో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు చెప్పాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు డిమాండ్ చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మలపేట రిజర్వాయర్ను పూర్తి చేసి, లిఫ్ట్ ద్వారా నీటిని తరలించేలా చర్యలు చేపట్టిందని, మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, న్యాలకొండ రాఘవరెడ్డి, కంబాల మల్లారెడ్డి, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, జకుల నాగరాజుయాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.