This Weekend OTT Movies | ఈ వారం సంక్రాంతి సందడి ఓటీటీలో కూడా కొనసాగుతోంది. థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేస్తుండగా, ఇంటి వద్దే వినోదాన్ని ఆస్వాదించే వారి కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పలు ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లను సిద్ధం చేశాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఏ సినిమా ఏ ఓటీటీలో వచ్చాయి అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
టాస్కరీ: ద స్మగ్లర్స్ వెబ్ సిరీస్ – [హిందీ, తెలుగు, తమిళం] – నీరజ్ పాండే రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
సెవెన్ డయల్స్ – [ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ] – అగాథా క్రిస్టీ నవల ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ద రిప్ [ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ] – యాక్షన్ థ్రిల్లర్ మూవీ.
కిల్లర్ వేల్ (Killer Whale) – సర్వైవల్ హారర్ చిత్రం.
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్? (Can This Love Be Translated) – కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా (తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది).
వన్ లాస్ట్ అడ్వెంచర్ (One Last Adventure) – ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మేకింగ్ డాక్యుమెంటరీ.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
దండోరా (Dhandoraa) – [తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది]
120 బహదూర్ (120 Bahadur) – [హిందీ] – 1962 యుద్ధం నేపథ్యంలో సాగే ఆర్మీ యాక్షన్ డ్రామా.
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (Bank of Bhagyalakshmi) – [కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం]
ఆర్టిస్ట్ (Artiste) – ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.
జీ5 (ZEE5)
గుర్రం పాపిరెడ్డి (Gurram Paapi Reddy) – [తెలుగు] – ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్.
భా భా భా (Bha Bha Ba) – [మలయాళం] – దిలీప్ హీరోగా, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ.
సఫియా సఫ్దర్ (Safia Safdar) – [హిందీ] – సోషల్ డ్రామా మూవీ.
జియో హాట్‌స్టార్ (JioHotstar)
అనంత (Anantha) – [తెలుగు, తమిళం, హిందీ] – పుట్టపర్తి సాయిబాబా మహిమల నేపథ్యంలో సురేష్ కృష్ణ తెరకెక్కించిన భక్తిరస చిత్రం.
పొనీస్ (PONIES) – స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.
డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (Downtown Abbey) – పీరియడ్ డ్రామా.
ఇతర ప్లాట్‌ఫామ్స్
అహా (Aha Video): రిప్పన్ స్వామి (తెలుగు), మహాసేన (తమిళం – అహా తమిళ్).
లయన్స్ గేట్ ప్లే: షెల్ (తెలుగు డబ్బింగ్), బందూక్ (కన్నడ).
సోనీ లివ్ (SonyLiv): కళంకావల్ (మలయాళం, తెలుగు, హిందీ).
సన్ నెక్స్ట్ (SunNxt): కిర్క్కన్ (మలయాళం).