ఆశ చచ్చిపోయింది
‘తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. తెరిచిన దుకాణాల్లో రొట్టె ముక్క కొనుక్కొందామంటే కార్డ్స్‌ను అంగీకరించట్లే. ఏటీఎంలలో డబ్బులు రావట్లేదు. బయటకు రావాలంటే బాంబుల భయం. కరెంటు కూడా లేని బంకర్లో పది రోజులుగా బతుకీడుస్తున్నాం.
- కేంద్రం కాపాడుతుందన్న నమ్మకము లేదు
- సుమీలో భారత విద్యార్థుల మనోవ్యథ ఇది
న్యూఢిల్లీ, మార్చి 7: ‘తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. తెరిచిన దుకాణాల్లో రొట్టె ముక్క కొనుక్కొందామంటే కార్డ్స్‌ను అంగీకరించట్లే. ఏటీఎంలలో డబ్బులు రావట్లేదు. బయటకు రావాలంటే బాంబుల భయం. కరెంటు కూడా లేని బంకర్లో పది రోజులుగా బతుకీడుస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుందన్న ఆశ చచ్చిపోయింది’ ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకొన్న ఓ భారత విద్యార్థిని మనోవ్యథ ఇది. ‘అందరం కలిసి కాలినడకన సరిహద్దులకు బయల్దేరాలనుకొన్నాం. అయితే, రిస్క్ చేయవద్దని, ఉన్నచోటునే ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకే, ఇక్కడే ఉండిపోయాం. అయితే, ఎంతకాలం ఇలా ఉండాలి? ఎప్పుడు మమ్మల్ని కాపాడుతారు?’ అని అజిత్ గంగాధరణ్ అనే మరో విద్యార్థి ప్రభుత్వాన్ని నిలదీశాడు. తమతో పాటు దాదాపు 700 మంది నగరంలో చిక్కుకుపోయారని, మంచును కరిగించుకొని దాహం తీర్చుకొంటున్నామని తెలిపాడు. ప్రభుత్వం వెంటనే తమను రక్షించాలని విజ్ఞప్తి చేశాడు.
పుతిన్, జెలెన్స్కీకి మోదీ ఫోన్
సుమీలో చిక్కుకొన్న భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తీసుకురావడానికి సాయం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు ఇరువురితో వేర్వేరుగా మాట్లాడారు. తరలింపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సుమీలోని విద్యార్థులు మండిపడ్డాకనే మోదీ సర్కారు మేల్కొన్నదని శివసేన ఎద్దేవా చేసింది. విద్యార్థులందరినీ తరలించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

