World War | న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశం ఉన్నదని, మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చని అభిప్రాయపడ్డారు.
ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన ఫ్రాన్సిస్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులను మూడో పక్షం ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని, ఇది ప్రమాదకరని అన్నారు. పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు.నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా భద్రతా మండలి ప్రస్తుత కూర్పు లేదని, దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.