Rahul Dravid | ఆ ఎడిటర్ నాపేరు తప్పు రాశాడు.. దానిని మార్చాలనుకున్నా : రాహుల్ ద్రావిడ్
భారత క్రికెట్ అభిమానులు ఇష్టంగా ‘ది వాల్’ అని పిలుచుకునే టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్న రాహుల్ ద్రావిడ్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ద్రావిడ్ పేరును పత్రికలో తప్పుగా ప్రచురించారట. సెంచరీ చేసినా తన పేరు ఎవరికీ తెలియదని, ఓ ఎడిటర్ చేసిన తప్పు తనలో పట్టుదలను పెంచిందని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రాతో ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ద్రావిడ్ ఈ విషయాలను పంచుకున్నాడు. ఈ కార్యక్రమంలో బింద్రా.. ‘మీరు స్కూళ్లో సెంచరీ చేశాక ఓ పత్రికలో మీపేరు తప్పుగా ప్రచురించారట కదా..’ అని అడగగా ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఆ అవును. ఆ ఎడిటర్ బహుశా నా పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని అనుకున్నాడేమో. Dravid అనే పేరు ఎవరికీ ఉండదు కదా.. అది David అయి ఉంటుందని భావించి ఉంటాడు. అంతేగాక అది కామన్ నేమ్. అయితే అప్పుడే నాకు విషయం అర్థమైంది. వాస్తవంగా చెప్పాలంటే నాకు అది ఒక గుణపాఠం వంటిది. స్కూల్ క్రికెట్లో సెంచరీ చేసినా నేను ఎవరికీ తెలియదు. ప్రజలకు కనీసం నా పేరు కూడా తెలియదు. నేను అప్పుడే ఫిక్స్ అయ్యా. దానిని మార్చాలనుకున్నా..’ అని తెలిపాడు.
ద్రావిడ్ చెప్పినట్టుగానే తానంటే ఏంటో తర్వాత నిరూపించుకున్నాడు. 1996లో శ్రీలంకతో వన్డే ఆడుతూ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ద్రావిడ్.. భారత జట్టు తరఫున 164 టెస్టులు, 344 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 24 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేలలో 48 సెంచరీలు చేసిన ద్రావిడ్.. 2012లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. రిటైరయ్యాక ఎన్సీఏ చీఫ్‌గా, అండర్-19 జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్నాడు.
Rahul ‘David’ recounts a crucial lesson he learnt after scoring his 1st century in school cricket. Tune in to my podcast ‘In the Zone’ to dissect the mind of THE gentleman from the gentleman’s game.@under25universe https://t.co/A9iUknxEMu #InTheZoneWithAB #Under25Original pic.twitter.com/v2CAvNAPRB
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) July 25, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

