సిటీబ్యూరో : ఒకప్పుడు ప్రకృతి అందాలకు చిరునామాగా.. సిటీకి అందమైన పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదాన్ని పంచిన దుర్గం చెరువు.. ఇప్పుడు దుర్గంధంగా మారిపోయింది. నిర్వహణ లోపంతో వ్యర్థాలతో నిండి కళాహీనంగా తయారైంది. మరోవైపు చెరువులో చేపలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి.
ఇవి క్రమంగా ఒడ్డుకు చేరడంతో పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. పర్యాటకులు, వాకర్స్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ‘దుర్గం’ను సుందరంగా తీర్చి దిద్దితే.. కాంగ్రెస్ సర్కార్ నాశనం చేసిందని మండిపడుతున్నారు.