అగ్ర హీరో రామ్‌చరణ్‌కి ఇమిడియట్‌గా హిట్ కావాలి. దర్శకుడు బుచ్చిబాబు సాన ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాలి. అందుకే వారిద్దరికీ ‘ఆర్సి 16’(వర్కింగ్ టైటిల్) కీలకం. ప్రీప్రొడక్షన్ నుంచే ఈ సినిమాపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరచడానికి కారణం అదే. క్రీడా నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ఈ సినిమాలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ సినిమాలో కీ రోల్ పోషిస్తుందని టాక్. అందుకే ఈ ఎపిసోడ్‌ని ఎమోషనల్‌గా ప్లాన్ చేశాడట బుచ్చిబాబు.
రీసెంట్గా విడుదలైన రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’లోనూ ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్‌పై ఆడియన్స్‌లో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ‘ఆర్సి 16’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని మాత్రం నెక్ట్స్ లెవల్లో ప్లాన్ చేశారట బుచ్చిబాబు. నెక్ట్స్ షెడ్యూల్లో ఈ బిగ్ ఎపిసోడ్‌ని చిత్రీకరిస్తారని సమాచారం. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, మైత్రీమూవీమేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.