హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంప్లాయిస్ హెల్త్‌కార్డులపై సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. హెల్త్‌కేర్ ట్రస్టు ఏర్పాటు చేయకుండా, మార్గదర్శకాలు విడుదల చేయకుండా వివరాలు సేకరించడంపై జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ సీఎస్‌ను కలిసి నిరసన తెలిపారు.
ఏ దవాఖానల్లోచికిత్స అందిస్తారు..? పెన్షనర్ల నుంచి ఎంత మినహాయిస్తారు..? స్కీమ్ వదులుకునే ఆప్షన్ ఉందా..? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.