రైతు వ్యతిరేక చట్టాల రద్దు సందర్భంగా ఘట్కేసర్లో టీఆర్ఎస్ నాయకుల సంబురాలు
ఘట్కేసర్, నవంబర్ 19 : ఏడాది కాలంగా రైతుల సుధీర్ఘ పోరాట ఫలితం, రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు నినదించిన సీఎం కేసీఆర్ పోరాటం కూడా ఫలించిందని ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడంతో ఘట్కేసర్లో శుక్రవారం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలతో కేంద్రం కార్పొరేట్ సంస్థలకు లాభం చేసి, రైతులను విస్మరించిందన్నారు. ఇది గుర్తించిన సీఎం కేసీఆర్ రైతులకు మద్దతుగా వ్యవసాయ చట్టాల రద్దుకు పోరాటం చేశారని పేర్కొన్నారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్.రమేశ్, రైతు సొసైటీ డైరెక్టర్ ధర్మారెడ్డి, కీసరగుట్ట ట్రస్టు బోర్డు డైరెక్టర్ ఎం.నరేశ్ గౌడ్, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, బస్వరాజ్ గౌడ్, ముస్తాఫా, మచ్చేందర్ రెడ్డి, భిక్షపతి గౌడ్, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.