The Odyssey | ‘ఓపెన్‌హైమర్’తో ఆస్కార్‌ను కొల్లగొట్టిన గ్లోబల్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తన తదుపరి విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్రీకు పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. హోమర్ రాసిన పురాతన గ్రీకు మహాకావ్యం ‘ది ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ‘ఒడిస్సియస్’ తన స్వస్థలమైన ఇథాకాకు చేరుకోవడానికి పదేళ్లపాటు సముద్రంలో ఎదుర్కొన్న సాహసోపేతమైన ప్రయాణం, గ్రీకు దేవతలు, రాక్షసులతో చేసిన పోరాటాన్ని నోలన్ తన స్టైల్లో చూపించబోతున్నారు. ఇందులో ఒడిస్సియస్‌గా మ్యాట్ డామన్ నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో టామ్ హాలండ్ (కుమారుడు టెలిమాకస్‌గా), యాన్ హాత్వే (భార్య పెనెలోప్ గా) కనిపిస్తున్నారు. ఇంకా జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి స్టార్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమాను పూర్తిగా సరికొత్త IMAX 70mm టెక్నాలజీతో చిత్రీకరించినట్లు తెలుస్తుంది.