అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలావుంటే.. ఈ భారతీయ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘ది మమ్మీ’ఫేం ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులోని ఆయన పాత్ర పేరు ‘సర్ థియోడోర్ హెక్టర్’. మంగళవారం ఆర్నాల్డ్ వోస్లూ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘కరవు నేల రాక్షసుడు.. సర్ థియోడోర్ హెక్టర్’ అంటూ ఈ పోస్టర్లో ఆయన పాత్రను పరిచయం చేశారు. 19వ శతాబ్దంలోని బ్రిటీష్ పాలనాకాలంలో తెలుగునేలపై ఏర్పడ్డ ‘డొక్కల కరువు’ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ సినిమా తెరకెక్కుతున్నట్టు వినికిడి. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, సమర్పణ: గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, టీసిరీస్ ఫిల్మ్స్.