సినీరంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2026’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం మొత్తం 55 ఎంట్రీలు వచ్చాయని, ఇందులో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయని, ఈ నెల 20వ తేదీన వివిధ విభాగాలలో విజేతలను ఎంపిక చేస్తామని ఆర్.కె.గౌడ్ తెలిపారు.
మొత్తం 30 కేటగిరీల్లో అవార్ట్స్ అందించబోతున్నామని, ఈ నెల 21న హైదరాబాద్‌లో పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ అవార్డుల కమిటీ జ్యూరీకి సీనియర్ నటి ఇంద్రజ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.