కంఠేశ్వర్, మే 26 : వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లా రై తాంగానికి వాణిజ్య పరిశ్రమల మం త్రిత్వ శాఖ ద్వారా తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. సమీకృ త జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (డీజీఎఫ్టీ), ఏపీఈడీఏ, జాతీయ పసుపు బోర్డు, నాబార్డు, ఇండియా పోస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎగుమతి ప్రోత్సాహాక కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జిల్లాల స్థాయిలో ఎగుమతులను గణనీయంగా పెంపొందించటమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ-కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, పసుపు, వరి, సోయాబిన్, మక్కజొన్న, పత్తి తదితర పంటల మార్కెట్ వైవిద్దీకరణ అంశాలపై డీజీఎఫ్టీ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.
నాణ్యమైన అధిక దిగుబడులను అందించే పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, పంట ఉత్పత్తుల మార్కెటింగ్, విదేశాలకు ఎగుమతి, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, సాగునీటి యాజమాన్య పద్ధతులను వివరిస్తూ.. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రైతాంగం సేద్యపు రంగంలో ఆధునిక విధానాలు, శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శ రైతులుగా పేరు పొందారన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత రైతులు అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తారని, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన వంగడాల విషయంలో అంకాపూర్ ప్రాంత రైతులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు.
డీజీఎఫ్టీ ప్రాంతీయ సంచాలకులు చవాన్ మా ట్లాడుతూ విదేశీ మాదకద్రవ్యం పెరిగి రూపాయి మారకం బలపడుతుందని, ఇదొక రకంగా దేశానికి సేవ చేసినట్లవుతుందని సూచించారు. డీజీఎఫ్టీ ద్వారా జిల్లా రైతాంగాని కి తగిన తోడ్పాటునందేలా కృషి చేస్తామన్నారు. జాతీయ పసు పు బోర్డు అధికారులు కేవీఎస్ శైలజ, ప్రత్యూష్, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు విద్య, జనార్దన్‌రెడ్డి, ఏపీఈడీ నాయు డు, నాబార్డు డీజీఎం ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సురేశ్‌కుమార్, జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీనివాస్, రైతు లు, ట్రేడర్లు పాల్గొన్నారు.