వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఓ మొక్క చెట్టయ్యేందుకు ఏండ్లు పడుతుంది. కానీ మనం సొంత ప్రయోజనాల కోసం చెట్లను సెకన్లలో కొట్టేస్తాం. ప్రాణకోటికి ఆక్సిజన్ అందకుండా చేస్తాం. అయితే, ఓ పొడవాటి పచ్చని చెట్టును ముగ్గురు వ్యక్తులు కలిసి కొట్టేయగా, ఆ చెట్టు ఒకరిపై పగతీర్చుకున్నది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘వీడియోజమాన్1’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి రంపంతో ఓ చెట్టును నరికేశారు. చెట్టు కిందపడేటప్పుడు దాని ఒక కొనకు వ్యక్తి చిక్కుకుపోయి, గాల్లోకి లేచాడు. మిగతా ఇద్దరు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఈ వీడియో 83 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. 3.7 మిలియన్ లైక్స్‌తో దూసుకుపోతున్నది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘రివేంజ్ ఆఫ్ ది ట్రీ’ అని మరొకరు వ్యాఖ్యానించారు.