హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్(టీఎస్‌టీఏ), జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జేహెచ్‌ఐసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ మంగళవారం ఘనంగా మొదలైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో భారత ప్లేయర్ మనీశ్ సురేశ్‌కుమార్ 6-2, 6-1తో టోర్నీ టాప్‌సీడ్ ఎరిక్ వాన్లెల్బోయిమ్(ఉక్రెయిన్)పై సంచలన విజయం సాధించాడు.
మరో పోరులో వెటరన్ ప్లేయర్ విష్ణువర్ధన్ 6-3, 6-4తో ఆరవ సీడ్ తన్పెట చంటా(థాయ్‌లాండ్)పై గెలిచి ముందంజ వేశాడు. అంతకుముందు టోర్నీని జేహెచ్‌ఐసీ కార్యదర్శి జగ్గారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కన్వీనర్ సురేశ్‌రెడ్డి, టీఎస్‌టీఏ అధ్యక్షుడు రమణ్, కో ఆర్డినేటర్లు రామకృష్ణబాబు రాజు పాల్గొన్నారు.