ముంబై : బీజేపీ పాలనలో మరో ఇంజినీరింగ్ మాయాజాలం బయటపడింది. ముంబైలోని మెట్రో లైన్ 9 ప్రాజెక్టులో భాగమైన మీరా-భయందర్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లో ఈ వింత నిర్మాణం వెలుగుచూసింది. ఫ్లైఓవర్‌పై నాలుగు లేన్ల రహదారి హఠాత్తుగా రెండు లేన్లుగా మారిపోవడం వివాదానికి దారితీసింది.
దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మాత్రం ఈ డిజైన్ని గట్టిగా సమర్థించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన డిజైనేనని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అలా నిర్మించామని తెలిపింది.