భార్య, భర్తలు అన్నాక కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. ఆపై కలిసుంటారు. కానీ ఓ భర్త తనను భార్య కొట్టిందంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది ఏ నాలుగు గోడల మధ్యలో కాదు.. పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. అది మరీ రాత్రిపూట. దీంతో పోలీసులు అతడిని సముదాయించి పంపారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం..ఓపిక పట్టాలి అని బుజ్జగించి ఇంటికి సాగనంపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.