సెయింట్ లూయిస్: గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa).. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ ఫైనల్లో ఫాబియానో కారౌనాను అతను ఓడించాడు. ఆరంభంలో వెనుకబడ్డ ప్రజ్ఞానంద .. ఆ తర్వాత పుంజుకున్నాడు. చివరకు 15-13 స్కోరుతో భారత ప్లేయర్ ఫాబియానోపై విజయం సాధించాడు. జీసీటీ టైటిల్‌ను ప్రజ్ఞానంద గెలవడం ఇదే తొలిసారి. ఈ విక్టరీతో అతనికి రెండు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది. చివరి రోజు ఆరు పాయింట్ల లోటుతో ఉన్న ప్రజ్ఞానంద .. కారౌనాతో జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్స్‌లో విక్టరీ కొట్టాడు. ఇక ఆ తర్వాత బ్లిట్జ్ సెక్షన్‌లోనూ అద్భత ప్రదర్శన ఇచ్చి 15-13తో టైటిల్ గెలుచుకున్నాడు.
తొలి క్లాసికల్ గేమ్‌లో ప్రజ్ఞా ఓడిపోయాడు. 6-0 తేడాతో ఆ గేమ్‌లో పరాజయాన్ని చూవి చూశాడు. ఆ తర్వాత రెండో క్లాసికల్ గేమ్‌ను అతను డ్రా చేసుకున్నాడు. 3-3 పాయింట్లతో ఆ గేమ్ డ్రా అయ్యింది. అయితే ఆఖరి రోజు 6 పాయింట్ల అడ్వాంటేజ్‌తో అమెరికా ప్లేయర్ ముందున్నాడు. కానీ ర్యాపిడ్ గేమ్స్‌తో ప్రజ్ఞా మొత్తం మార్చేశాడు.