Ananya Pandey | బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే వ్యక్తిగత జీవితం మరోసారి బీ-టౌన్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తల్లో నిలిచిన ఆమె, తన ప్రియుడు వాకర్ బ్లాంకోతో విడిపోయినట్లు జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా వీరి రిలేషన్ కొనసాగగా, తాజాగా ముగింపు పలికారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అనన్య పాండే లేదా వాకర్ బ్లాంకో ఈ బ్రేకప్ వార్తలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కాగా, 2024 మధ్యలో జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకల సందర్భంగా అనన్య పాండే, వాకర్ బ్లాంకో మధ్య పరిచయం ఏర్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని బీ-టౌన్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రత్యేకంగా స్పందించడం వంటి అంశాలు వారి రిలేషన్‌షిప్‌పై మరింత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వాకర్ పేరుకు సంబంధించిన లాకెట్‌ను అనన్య ధరించినట్లు వచ్చిన వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.అయితే తమ ప్రేమ గురించి అనన్య, వాకర్ ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు విడిపోయారనే వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఈ బంధానికి ముగింపు పలికారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎలాంటి పెద్ద గొడవలు లేకుండా, పరస్పర అంగీకారంతోనే స్నేహపూర్వకంగా వేర్వేరు మార్గాలను ఎంచుకున్నట్లు కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ లేనందున, ప్రస్తుతం ఇవన్నీ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది. వాకర్ బ్లాంకోకు ముందు అనన్య పాండే పేరు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తోను బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు చాలాకాలం బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేశాయి. అనంతరం ఆ బంధానికి కూడా ముగింపు పలికారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వాకర్ బ్లాంకోతోనూ బ్రేకప్ వార్తలు రావడంతో అనన్య వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. రు.