‘పుష్ప’ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’..‘సామి సామి..’ పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. తాజాగా ఈ సినిమాలోని ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో గీతాన్ని ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్‌రావు, అజయ్‌ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, దర్శకత్వం: సుకుమార్.