బెంగళూరు: ఇస్రో గనన్‌యాన్ క్రూ మాడ్యుల్ కోసం డిసిలిరేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నిర్వహించిన డ్రోగ్ పారాచూట్ల విస్తరణ అర్హత పరీక్షల శ్రేణి విజయవంతమైందని ఇస్రో శనివారం తెలిపింది. ఈ పరీక్షలు చండీగఢ్‌లోని చెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చి లేబరేటరీ (టీబీఆర్ఎల్)లోని రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్‌టీఆర్‌ఎస్)లో ఈ నెల 18,19 తేదీలలో పూర్తయ్యాయని వివరించింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ డిసిలరేషన్ సిస్టమ్ మొత్తం 10 పారాచూట్లను కలిగి ఉంటుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.