హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక రంగంలో విశేష సేవలందిస్తున్న వారికి డాక్టర్ సీ కృష్ణారావు మెమోరియల్ సొసైటీ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ పాడి రైతుగా లోకసాని వెంకట్‌రెడ్డి (నల్లగొండ), ఉత్తమ పౌల్ట్రీ రైతుగా బాలస్వామి (నిజామాబాద్), ఉత్తమ గొర్రెల/మేకల పెంపకందారుగా వీ రవి శ్రీనివాస్ (వికారాబాద్) ఎంపికయ్యారు.
పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో జీవనసాఫల్య పురసారానికి ఆచార్యులు కొండల్‌రెడ్డి (భువనగిరి), పశుసంవర్ధక శాఖ జీవనసాఫల్య పురసారానికి డాక్టర్ వై తిరుపతయ్య (నాగర్‌కర్నూల్) ఎంపికయ్యారు. ఈ నెల 13న అవార్డులను అందజేయనున్నారు.