హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని, చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయలేదని ఆరోపిస్తూ ఏసీబీ తెలంగాణ డైరెక్టర్ జనరల్ చారుసిన్హాకు టీజీఎస్పీడీసీఎల్ ఇబ్రహీంబాగ్ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(ఆపరేషన్) అంబేదర్ భార్య తబిత శనివారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేరొన్న వివరాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ 15న నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేదర్ దర్యాప్తు సంస్థకు పూర్తిస్థాయిలో సహకరించారని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వచ్ఛందంగా సమర్పించారని, అయినప్పటికీ ఆయనను అరెస్ట్ చేసి, 36 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారని తెలిపారు.
అయితే, ఇదేతరహా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదురొంటున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి విషయంలో అధికారులు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆయనకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023లోని సెక్షన్ 35(3) కింద కేవలం నోటీస్ మాత్రమే జారీచేసి, అరెస్ట్, జ్యుడీషియల్ రిమాండ్గానీ చేయలేదని గుర్తుచేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తమకు ఎలాంటి రాజకీయ, ఆర్థిక అండదండలు లేవని చెప్పారు.
ఒకే రకమైన ఆరోపణలు ఎదురొంటున్న ఇద్దరు వ్యక్తులపట్ల దర్యాప్తు సంస్థ రెండు వేర్వేరు నిబంధనలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వపు హకును కాలరాయడమేనని పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద తన భర్తకు దకాల్సిన చట్టపరమైన రక్షణను ఎందుకు నిరాకరించారో సమీక్షించాలని, అలాగే ఆయనపై నమోదైన తప్పుడు కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టప్రకారం ఉపసంహరించుకోవాలని ఆమె ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను కోరారు.