
సికింద్రాబాద్, డిసెంబర్ 1: సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం న్యూ బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అందజేశారు.
న్యూ బోయిన్పల్లి సంజీవయ్యనగర్ కాలనీ, చిన్నతోకట్టకు చెందిన అనూష, రజనీ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిని సంప్రదించగా వెంటనే సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. దీంతో సీఎం సహాయనిధి నుంచి అనూషకు రూ.25వేలు, రజనీకి రూ.20వేలు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రామ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.