Rajasthan | రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి.. అభ్యర్థుల ఎంపికపై క్యాడర్ అసంతృప్తి
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలున్నాయి.
Rajasthan | (స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్(నమస్తే తెలంగాణ): రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో సగటున 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఆ లెక్కన టికెట్లు పొందిన ఏడుగురు ఎంపీలు వారి లోక్‌సభ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేస్తారని, దాంతో గెలుపు సునాయాసమవుతుందని అధిష్ఠానం భావిస్తున్నది. అయితే టికెట్ లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులూ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందులో కొందరు తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని తిరుగుబావుటా ఎగరేశారు.

విద్యాధర్ నగర్ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నర్సత్ సింగ్ రజ్వీని కాదని ఎంపీ దియా కుమారికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు కావడం రాజకీయంగా ప్రాముఖ్యం సంతరించుకుంది. తనను కాదని ఎంపీకి టికెట్ ఎలా ఇస్తారని రజ్వీ బహిరంగంగానే అధిష్ఠానాన్ని నిలదీశారు. తిజ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోచోట తన తండ్రి జయరామ్ జాటవ్‌కు టికెట్ ఇస్తే మరో తిరుగుబాటు నేతను గెలిపిస్తానని అతని కుమార్తె ప్రకటించింది. సాంచోర్ టికెట్ పొందిన మరో ఎంపీ దేవీ పటేల్ సొంత గ్రామంలో పూజలు చేయడానికి వెళ్లగా అతడిపై రాళ్ల దాడి జరిగింది. టికెట్ ఆశించి భంగపడ్డ దానారాం చౌదరి వర్గీయులు ఈ దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే పార్టీలో అసంతృప్తులపై చర్యలు తీసుకుంటామని అధిష్ఠానం సంకేతాలిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే 11 మందిని 6 ఏండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా టికెట్ దక్కని నాయకుల్లో అసంతృప్తి చల్లారడం లేదు. ఎన్నికల వేళ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం అసంతృప్తికి దారి తీసింది.

వసుంధర వర్గం అసంతృప్తి
రాజస్థాన్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి వసుంధర రాజే బీజేపీలో బలమైన నేత. అయితే ఆమెకు ప్రధాని మోదీతో సత్సంబంధాలు లేవని రాజకీయ వర్గాల భోగట్టా. ఈ ఎన్నికల్లో ఆమె వర్గీయులకు టికెట్లు ఇవ్వకుండా ఆమెను రాజకీయంగా తొక్కేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆమెను రాజకీయంగా దెబ్బతీయడానికే మోదీ వ్యూహాత్మకంగా సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించారని భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

