హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ (బైపీసీ) స్పాట్ అడ్మిషన్ల గడువును అక్టోబర్ 6 వరకు అధికారులు పొడిగించారు. శనివారంతో ముగిసిన గడువును అక్టోబర్ 6లోగా కాలేజీలు పూర్తిచేసుకునే వెసులుబాటును కల్పించారు. స్పాట్లో భాగంగా బీ ఫార్మసీ, ఫార్మా -డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ వంటి కోర్సుల్లో మిగిలిన సీట్లను కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకోవచ్చు.