ఉట్నూర్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma Houses ) పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) పేర్కొన్నారు. ఉట్నూర్ మండలంలోని హీరాపూర్ (జే) గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి, లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్బండ వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాంప్రసాద్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.