ఒకే రోజు పరీక్ష ఉంటే 7న ఎగ్జామ్ : టీజీపీఎస్సీ
ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ-సివిల్), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (ఎస్సెస్సీ జేఈ) పరీక్షలు ఒకేరోజు తేదీపై టీజీపీఎస్సీ స్పందించింది. నవంబర్ 6న పరీక్ష ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే 7వ తేదీకి మారుస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్అండ్బీ ఏఈఈ-సివిల్ పరీక్షను 6,7 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ-సివిల్), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (ఎస్సెస్సీ జేఈ) పరీక్షలు ఒకేరోజు తేదీపై టీజీపీఎస్సీ స్పందించింది. నవంబర్ 6న పరీక్ష ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే 7వ తేదీకి మారుస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్అండ్బీ ఏఈఈ-సివిల్ పరీక్షను 6,7 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఎస్సెస్సీ జేఈ పరీక్షను నవంబర్ 2 నుంచి 6వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో 6న రెండు పరీక్షలు ఒకే రోజు జరుగనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది.
ఆర్అండ్బీ ఏఈఈ పరీక్ష షెడ్యూల్‌ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఎస్సెస్సీ చైర్మన్‌తో సంప్రదింపులు జరిపారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా నవంబర్ 4,5 తేదీల్లో పరీక్షలను పూర్తిచేస్తామని హామీనిచ్చారు. నవంబర్ 6న రెండు పరీక్షలున్న వారు ఎస్సెస్సీ జేఈ హాల్‌టికెట్, టీజీపీఎస్సీ ఏఈఈ హాల్‌టికెట్, టీజీపీస్సీ ఓటీఆర్లను ఈనెల 30 సాయంత్రం 5గంటలలోపు నేరుగా లేదా.. helpdesk@tgpsc.gov.in ఈమెయిల్‌కు పంపించాలని సూచించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి నవంబర్ 7న పరీక్ష రాసేలా తగిన ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

