హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గురువారం టీజీపీఎస్సీ అధికారులు జాబితా విడుదల చేశారు. ఇందులో ఒక్కరిని విత్‌హెల్డ్‌లో ఉంచారు.
డిసెంబర్ 30, 2022 న 1,388 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2024 నవంబర్ 17, 18 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. 2025 మార్చి 14న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా 1,370 మంది అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను tgpsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.